News April 10, 2025

మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

image

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.

Similar News

News April 18, 2025

సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

image

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.

News April 18, 2025

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బదిలీ

image

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

News April 18, 2025

‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

image

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.

error: Content is protected !!