News July 19, 2024
మెదక్: కొత్త డీఎంకు స్వాగతం.. పాత డీఎంకు వీడ్కోలు

మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్‌గా సురేఖ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్ నుంచి ఇక్కడికి బదిలీపై రాగా ఇక్కడ డీఎంగా పనిచేసిన సుధా బీహెచ్ఈఎల్ కు బదిలీ అయ్యారు. శుక్రవారం డిపో గ్యారేజ్ ఆవరణలో కొత్తగా వచ్చిన డీఎం సురేఖ, బదిలీపై వెళుతున్న డీఎం సుధను ఆర్టీసీ డిపో అధికారులు సిబ్బంది సన్మానించారు. సుధా సేవలను కొనియాడారు. అందరి సహకారంతో డిపోను అభివృద్ధి పథంలో ఉంచుతానని సురేఖ తెలిపారు.
Similar News
News August 25, 2025
మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
News August 25, 2025
కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News August 24, 2025
MDK: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్ రాహుల్ రాజ్

చిన్నశంకరంపేటలోని మహాత్మా గాంధీ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంభాషించారు. ఒక ఉపాధ్యాయుడిలా తరగతి గదిలో వారికి పలు ప్రశ్నలు వేశారు. అనంతరం, భోజనాన్ని పరిశీలించి, వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తాజా కూరగాయలు వాడాలని, వంటగదిలో శుభ్రత పాటించాలని వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.