News August 28, 2025

మెదక్: కొత్త హైవే రోడ్డు ఇలా వేస్తే ఎలా?: మంత్రి వివేక్

image

కొన్ని నెలల క్రితం వేసిన హైవే రోడ్డు కొట్టుకపోతే ఎలా అని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ అధికారులను ప్రశ్నించారు. నిన్న కురిసిన భారీ వర్షంతో హవేలీ ఘనాపూర్ మండలం నాగపూర్ గేట్ సమీపంలో కొట్టుకుపోయిన రోడ్డును మంత్రి పరిశీలించారు. నిన్న కారుతో పాటు వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. సరైన ప్రణాళిక లేకుండా హైవే ఇంజనీరింగ్ అధికారులు సరైనా అంచనా వేయకపోవడం శోచనీయమన్నారు.

Similar News

News August 28, 2025

మెదక్: రేపు విద్యా సంస్థలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కి సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు, పిల్లలను అవసరం లేని ప్రయాణాలకు దూరంగా ఉంచాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

News August 28, 2025

మెదక్: ఏరియల్ సర్వేకు రానున్న సీఎం రేవంత్

image

మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వేకు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. ముందుగా పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్ పరిశీలించి కామారెడ్డిలో అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు.

News August 28, 2025

నందిగామ బ్రిడ్జిని సందర్శించిన మంత్రి రాజనర్సింహ

image

నిజాంపేట మండల పరిధిలోని నందిగామలో కూలిన బ్రిడ్జిని మంత్రి దామోదర రాజనర్సింహ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ప్రజలు అధైర్య పడవద్దని, వర్షానికి నష్టపోయిన వారికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కలెక్టర్ స్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు అందుబాటులో ఉన్నారని, ఏదైనా సమస్య ఉంటే వారికి తెలపాలని సూచించారు.