News April 6, 2025
మెదక్: కోదండ రామాలయంలో కలెక్టర్ పూజలు

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News April 8, 2025
మెదక్: దేవాలయంలో పడగ విప్పిన నాగుపాము

మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలి పూర్‌లోని హనుమాన్ దేవాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయంలోని శివలింగం వద్ద సుమారు గంట పాటు పడగ విప్పి నాగుపాము దర్శనం ఇవ్వడంతో గ్రామస్థులు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు శివుడి వద్ద పడగవిప్పి ఉండడంతో యువకులు నాగుపాము ఫోటోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
News April 8, 2025
BREAKING: శామీర్‌పేటలో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు, డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌గా పోలీసులు గుర్తించారు.
News April 8, 2025
జహీరాబాద్: యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.