News January 13, 2026
మెదక్: కౌన్సిలర్ అభ్యర్థుల్లో రిజర్వేషన్ టెన్షన్

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.
Similar News
News January 28, 2026
రామాయంపేట: ఎన్నికల ముందే హామీల అమలు!

రామాయంపేట మున్సిపాలిటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ముందే అమలు చేస్తూ పలు వార్డుల్లో మినీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాలను వివరిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
News January 28, 2026
మెదక్: హత్య కేసులో నిదితుడికి జీవిత ఖైదు

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి కంపెనీ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన సర్వాన్ కుమార్ హత్యకు పాల్పడిన నిందితుడు ఓం ప్రకాష్ రాయ్‌కి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సునీల్ మొంజి, ధనుంజయ్, సర్వాన్ కుమార్ సోదరులు ఓ కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారన్నారు. ఓం ప్రకాష్ రాయ్ రాయితో కొట్టి హత్య చేసినట్లు వివరించారు.
News January 27, 2026
MDK: అధికారులందరూ సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 75 వార్డులుండగా
150 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు. నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.


