News March 30, 2024
మెదక్: గతం ఏకపక్షం.. ఈసారి త్రిముఖ పోరు..!

BRS, కాంగ్రెస్, BJP మెదక్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనతో ఉమ్మడి జిల్లాలలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. ఇక్కడ గతంలో 3సార్లు జరిగిన ఎన్నికల్లో ఫలితాలన్ని ఏకపక్షమని చెప్పొచ్చు. ఇక్కడ జాతీయ పార్టీలు ఎన్ని వ్యూహాలు పన్నినా.. ప్రాంతీయ పార్టీ హవానే సాగింది. అయితే ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వేళ ఏకపక్ష పోరు అసాధ్యమే అని త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Similar News
News September 16, 2025
రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 15, 2025
మెదక్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్

జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు పక్కాగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. మెదక్ బాలికల హై స్కూల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 22 నుంచి 28 వరకు ఈ పరీక్షలు 6 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
News September 15, 2025
మెదక్: ప్రజా పాలన ఉత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్

ఈనెల 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. మెదక్లో జరిగే కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.