News March 2, 2025
మెదక్: గెలుపుపై ఎవరి అంచనాలు వారివే.!

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
Similar News
News March 3, 2025
NLG: 113 కేంద్రాలు.. 58,222 మంది విద్యార్థులు

ఉమ్మడి NLG జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్‌ను నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన 58,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
News March 3, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మతో సింగరేణికి సంబంధించిన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.
News March 3, 2025
కిడ్నీలో రాళ్లు ఎలా వస్తాయంటే?

ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. మూత్రంలోని కొన్ని కెమికల్స్ బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవడం వల్ల కొన్ని స్ఫటికాలు ఏర్పడి రాళ్లుగా మారతాయి. నాన్‌వెజ్ ఎక్కువగా తిన్నా, నీళ్లు తక్కువగా తాగినా కిడ్నీలో రాళ్లు వస్తాయి. నిద్రలేమి, ఆలస్యంగా భోజనం చేయడం, విటమిన్ బీ6, సీ, డీ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. షుగర్, ఒబేసిటీతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య అధికం.