News March 12, 2025

మెదక్: గ్రూప్-2లో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 3వ ర్యాంక్

image

టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించారు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించారు. 2020లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరి 317 జీవోలో మెదక్ జిల్లాకు వచ్చారు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.

Similar News

News February 17, 2026

పిల్లల్లో మూర్ఛ ఉంటే ఏం చేయాలంటే?

image

మూర్ఛ వ్యాధి విషయంలో చాలా మంది అలర్ట్​గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చికిత్సను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడే 80-90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్‌ అవుతుందని చెబుతున్నారు.

News February 17, 2026

పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

image

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్​ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్​ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్​ వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

News February 17, 2026

KMR: మున్సి‘పల్స్’ అతివలదే

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా పీఠాలెక్కిన వారంతా అతివలే. వైస్ ఛైర్మన్‌లుగా పురుషులకు అవకాశం ఉన్నప్పటికీ అధికారపక్షం మహిళా వికాసం వైపే మొగ్గుచూపింది. దీంతో జిల్లాలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఛైర్మన్ మినహాయించి అన్ని చోట్ల మహిళలే పుర పీఠాలేక్కారు. జిల్లాలో మహిళాభుద్యాయం మరింత బలపడనుంది. రాజకీయాల్లో తాము సైతం రాణిస్తామని, అభివృద్ధికి పాటుపడతామంటున్నారు.