News March 13, 2025
మెదక్: గ్రూప్- 2 మహిళా విభాగంలో సుస్మితకు 2వ ర్యాంకు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన బాయికాడి సుస్మిత గ్రూప్-2 మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో ఆమె 406.5 మార్కులు పొందింది. అలాగే గ్రూప్-1 ఫలితాల్లో సైతం 401 మార్కులు సాధించింది. ప్రస్తుతం ఆమె కొల్చారం గురుకులంలో పీజీటీ(గణితం)గా పని చేస్తుంది. ఈ ర్యాంకుల ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
Similar News
News March 13, 2025
మెదక్‌లో మహిళలు మిస్..

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.
News March 13, 2025
మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.
News March 13, 2025
మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.