News April 5, 2025
మెదక్: చనిపోయిన జింకకు పోస్టుమార్టం.. అంత్యక్రియలు పూర్తి

రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో ఊరి కుక్కల దాడిలో జింక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కుక్కల దాడిలోనే జింక మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
News February 27, 2026
మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.
News February 27, 2026
మెదక్: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను వివరించారు.


