News March 4, 2025
మెదక్: చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో ఆందోళన !

కరీంనగర్‌లో పట్టభద్రుల MLCఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్నటి నుంచి చెల్లిన, చెల్లని ఓట్లు వేరు చేసి తాజాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. హోరాహోరీగా సాగిన పోలింగ్‌లో తొలి ప్రాధాన్య ఓట్లతో గెలుపు కష్టమేనని పలువురు అంటున్నారు. చెల్లని ఓట్లు అధికంగా కనిపించడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఓట్లతో ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని, ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్న టెన్షన్ మొదలైంది.
Similar News
News April 21, 2025
మెదక్: ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం సంబంధిత కింది స్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమంలో తెలపాలని ఎస్పీ సూచించారు.
News April 21, 2025
BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.