News November 11, 2025

మెదక్: చేగుంటలో చిరుత పులి మృతి

image

చేగుంట మండలం గొల్లపల్లి తండా, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన <<18254855>>చిరుత పులి <<>> మంగళవారం ఉదయం మృతి చెందింది. నిన్న సాయంత్రం చెట్ల పొదల్లో కదలలేని స్థితిలో కనిపించిన చిరుతను గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయానికి మృతి చెందిన చిరుతపులిని గొడుగుపల్లి శివారులో గుర్తించారు. అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు.

Similar News

News November 11, 2025

వరంగల్‌లో 121 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు సోమవారం ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 121 కేసులు నమోదు కాగా, ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 74 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

News November 11, 2025

వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్, కాజీపేట మీదుగా బెంగళూరు-ముజఫర్‌పూర్, యశ్వంతపూర్-ముజఫర్‌పూర్ మధ్య నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లకు వరంగల్ సహా పలు స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.

News November 11, 2025

జడేజాను వదులుకోవద్దు: సురేశ్ రైనా

image

జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్‌లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.