News March 18, 2025

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. హవేళిఘనపూర్, మెదక్,  పాపన్నపేటలో 40.3డిగ్రీలు, నర్సాపూర్, టేక్మాల్ 40‌.2, వెల్దుర్తి 39.9, కుల్చారం 39.8, నిజాంపేట్ 39.7, చిన్నశంకరంపేట 39.6, శివ్వంపేట 39.1, చిలపిచెడ్, చేగుంట 39.0, మాసాయిపేట 38.8, రేగోడ్ 38.7, కౌడిపల్లి 38.4, పెద్దశంకరంపేట 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News July 7, 2025

మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News July 7, 2025

తూప్రాన్: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు గురుకుల విద్యార్థులు

image

తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తారా సింగ్ తెలిపారు. గురుకుల కళాశాల విద్యార్థులు రాకేశ్, విష్ణు శ్రీ చరణ్ ఇరువురు డెహ్రాడూన్‌లో ఈ నెల 12 నుంచి జరిగే రగ్బీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపల్‌తో పాటు వైస్ ప్రిన్సిపల్ సుహాసిని, పీఈటీ రమేశ్, పీడీ నవీన్ విద్యార్థులను అభినందించారు.

News July 7, 2025

మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

image

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.