News December 16, 2024

మెదక్: జిల్లాలో చలి పంజా.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. ఆదివారం శివంపేటలో 8 డిగ్రీలకు పడిపోయింది. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదు అయింది. జిల్లాలో అనేక చోట్ల సాయంత్రం ఐదు గంటల నుంచి, ఉదయం 9 గంటల వరకు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి ఎక్కువ కావడంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, అస్తమా ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Similar News

News February 16, 2026

మెదక్: 4 ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ

image

మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టారు.

News February 16, 2026

మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

image

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

News February 16, 2026

మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

image

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.