News February 11, 2025

మెదక్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దీంతో బోర్లు పొయ్యని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో 9.30మీటర్ల లోతులో నీటిమట్టం ఉంటే జనవరి చివరి వారంకి వచ్చేసరికి 10.94 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయిందని అధికారులు తెలిపారు. భూగర్భ జలాలు పడిపోవడంతో నీరును పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.

Similar News

News February 11, 2025

మెదక్: వేర్వేరుగా నలుగురి ఆత్మహత్య

image

వేర్వేరుగా నలుగురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో సర్సింలు(38) అప్పులు తీర్చలేక చెరువులో దూకి మృతి చెందగా, చేగుంటలో అనారోగ్యంతో వృద్ధుడు బాలయ్య(79) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరబాద్‌లో ఛత్తీస్ గఢ్ కూలీ రాహుల్ (25) చెట్టుకు ఉరేసుకుని, చిలిపిచేడ్‌లో మంజీరాలో దూకి రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతితో చెందటంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.

News February 11, 2025

మెదక్: కూలి పనులు దొరకలేదని యువకుడి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్(25) పనుల కోసం ఐదు రోజుల క్రితం స్నేహితుడు వద్దకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరకకపోవడంతో మద్యానికి బానిసై దగ్గరున్న డబ్బులు అన్ని ఖర్చు చేశాడు. పని లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News February 11, 2025

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులకు ఎస్పీ సూచనలు

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్‌ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడారు.

error: Content is protected !!