News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News December 30, 2025
జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకం: మెదక్ అదనపు కలెక్టర్

పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి సమాచార హక్కు చట్టం కీలకమని అదనపు కలెక్టర్ మెంచు నగేశ్ అన్నారు. సమాచార హక్కు చట్టం-2005పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు. పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలన్నారు.
News December 30, 2025
నర్సాపూర్: తండ్రిని పొడిచిన కొడుకుకు ఏడేళ్ల జైలు శిక్ష

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆస్తి పంపకం చేయాలని తండ్రి దశరథను కత్తితో పొడిచిన కొడుకు నాగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి సుభావల్లి తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. నేరస్థుడికి శిక్షపడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
News December 30, 2025
మెదక్: ‘పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు’

ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమంలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో పని చేస్తున్న పిల్లలను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.


