News March 12, 2025

మెదక్ జిల్లాలో పోలీస్ హోంగార్డు మృతి

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Similar News

News March 1, 2026

మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

News February 28, 2026

మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

image

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.

News February 28, 2026

మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.