News May 17, 2024

మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో(ఉదయం 8:30 గంటల వరకు) నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా రామాయంపేట 62.5మి.మి, కొండపాక 51.5, గజ్వేల్ 44.0, చీకోడు 38.8, హబ్సిపూర్ 37.8, మాసాయిపేట 36.3, లకుడారం 35.8, బేగంపేట 35.5, కొడకండ్ల 34.0, నారాయణరావుపేట 31.3, మిన్పూర్ 30.5, కాగజ్ మద్దూర్ 30.3, అల్లాదుర్గం, పాల్వంచ 30.0 మి.మి వర్షపాతం నమోదయింది.

Similar News

News October 5, 2024

మెదక్: నేటితో ముగియనున్న డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా గత నాలుగు రోజుల నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నేటితో ముగియనుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంకెవరైనా మిగిలిన అభ్యర్థులు ఉంటే ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు.

News October 5, 2024

మెదక్: పక్కాగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన: అదనపు కలెక్టర్

image

డిఎస్సీ 2024లో అర్హత సాధించిన 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా, వేగవంతంగా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డీఎస్సీ 2024లో 704 ఎంపికయ్యారని 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతుండగా గురువారం సందర్శించారు. మొత్తం 704 మంది అభ్యర్థులకుగాను 618 మంది అభ్యర్థులు వచ్చారు.

News October 5, 2024

మెదక్: ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి జిల్లాలోని మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.మెదక్,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని,కొన్నిచోట్ల మోస్తారు వర్షం మరి కొన్నిచోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.