News February 20, 2025
మెదక్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల ముందస్తు అరెస్టులు

మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ (రెగ్యులర్) చేయాలన్న పిలుపుతో ఆర్టిజన్ ఉద్యోగులు చలో హైదరాబాద్ విద్యుత్ సౌదాకు పిలుపునిచ్చారు. యూనియన్ నాయకుల పిలుపుమేరకు చలో విద్యుత్ సౌదా వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
Similar News
News December 14, 2025
మెదక్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ నమోదు

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు సగటున 21.83 % పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా ఓటింగ్ శాతం ఇలా ఉంది. తూప్రాన్ 25.49 %, మనోహరాబాద్ 23.03 %, చేగుంట 19.52 %, నార్సింగి 18.04 %, రామాయంపేట్ 22.14 %, నిజాంపేట్ 18.56 %, చిన్నశంకరంపేట్ 20.85 %, మెదక్ 27.99 % పోలింగ్ నమోదైంది.
News December 14, 2025
మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్: అదనపు ఎస్పీ

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి, వృద్ధురాలికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆమె ఓటు హక్కు వినియోగించుకునేలా సహాయం అందించారు.
News December 14, 2025
మెదక్ జిల్లాలో నేడు పంచాయతీల ఎన్నికలు

మెదక్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 7 గ్రామ పంచాయతీలు, 254 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,034 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2News చూస్తూ ఉండండి.


