News January 27, 2026
మెదక్ జిల్లాలో విషాదం

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ బత్తిని బ్రహ్మయ్య సోమవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, కర్తవ్యనిష్ఠకు ఆయన చిరునామాగా నిలిచారు. సుదీర్ఘ సేవా కాలంలో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన మరణ వార్తతో రేగోడ్ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్రహ్మయ్య సేవలను పలువురు ప్రజాప్రతినిధులు, సహోద్యోగులు స్మరించుకున్నారు.
Similar News
News January 28, 2026
అజిత్ దాదా.. బారామతి రాజకీయ మాంత్రికుడు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావ్ పవార్‌ను ఆయన అభిమానులంతా ‘అజిత్ దాదా’గా పిలుచుకునేవారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో NCPలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా 6 సార్లు Dy.CMగా చేశారు. పొలిటికల్ “సర్వైవర్” గానూ అజిత్ ప్రసిద్ధి. కీలకమైన సమస్యలను సైతం పరిష్కరించడంలో తనదైన ముద్ర వేసేవారు. పవార్ తల్లిదండ్రులు అనంతరావు పవార్, అశాతై పవార్.
News January 28, 2026
HYD నుంచి 900 స్పెషల్ బస్సులు

నేటి నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 900 బస్సులను నడుపుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆర్టీసీ అధికారులూ రంగంలోకి దిగి ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
News January 28, 2026
147పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

<


