News August 23, 2025

మెదక్ జిల్లాలో 23 మంది కొత్త గెజిటెడ్ HMల నియామకం

image

ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతిలో భాగంగా మెదక్ జిల్లాకు 23 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అలాట్ అయ్యారు. ఇందులో శుక్రవారం 22 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు బాధ్యతలు చేపట్టారు. జిల్లాల వారీగా మెదక్-9, ఖమ్మం-6, సిద్దిపేట -4, హన్మకొండ-2, కొత్తగూడెం, కామారెడ్డి ఒక్కొక్కరు ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి సర్ధన హై స్కూల్ పోస్టింగ్ ఇచ్చిన ఉపాధ్యాయురాలు జాయిన్ కాలేదు. 15 రోజుల సమయం ఉంది.

Similar News

News August 23, 2025

మెదక్: పాఠశాలకు టెన్త్ మెమోలు

image

మార్చి, జూన్ 2025లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లు లాంగ్ మెమోలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సర్టిఫికెట్లు అందిన విషయాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ధారించి, సంబంధిత MEOలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సర్టిఫికెట్లు రాకపోతే వెంటనే వివరాలు ACGEకి పంపాలని ఆదేశించారు.

News August 23, 2025

మెదక్: నాడు విద్యార్థి.. నేడు గెజిటెడ్ హెచ్ఎం

image

మెదక్ మండలం మాచవరం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా వై. సుకన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై వెళ్లారు. అయితే ర్యాలమడుగు గ్రామానికి చెందిన సుకన్య మాచవరం పాఠశాలలోనే చదువుకున్నారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

News August 22, 2025

పనుల జాతరలో అదనపు కలెక్టర్ నగేష్

image

పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం హవేలిగణపూర్ మండలం చౌట్లపల్లిలో పనుల జాతర నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎంపీడీఓ ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు, వ్యక్తిగత సోక్ పిట్‌ల కోసం దరఖాస్తులను అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు(నరేగ) పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.