News February 1, 2026

మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

image

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.

Similar News

News February 1, 2026

MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 1, 2026

మెదక్: ఆపరేషన్ స్మైల్.. 81 మంది SAFE

image

జిల్లాలో జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 81 మంది బాలలను రక్షించి, 69 మందిని తల్లిదండ్రులకు అప్పగించి, 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 6 పాఠశాలలో ప్రవేశం కల్పించడం అభినందనీయమన్నారు.

News February 1, 2026

మెదక్: NATIONALలో సిల్వర్ మెడల్

image

మాస్టర్స్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2026 లాంగ్ జంప్‌లో రిటైర్డ్ పీడీ డా.కే.ప్రభు సిల్వర్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో జరిగాయి. గత నెలలో రాష్ట్ర స్థాయి మాస్టర్ పోటీలు కరీంనగర్‌లో జరగ్గా గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించారు. ప్రభు మెడల్ సాధించడం పట్ల వ్యాయామం ఉపాధ్యాయులు, గుల్షన్ క్లబ్ సభ్యులు అభినందించారు.