News March 9, 2026

మెదక్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా న్యాయమూర్తి నీలిమను జిల్లా కోర్టు ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ ప్రతిమా సింగ్ కలిశారు. ఇటీవల మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్ రాగా మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలు చర్చించారు. జిల్లాలో కోర్టులు, కేసుల పరిష్కారం, ఇతర విషయాలపై ఇరువురు మాట్లాడారు. పాలనాపరమైన అంశాలలో సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News March 9, 2026

శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యక పూజలు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీతునికి నల్ల పోచమ్మకు అర్చకుడు శివప్ప ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం రెండో రోజు బండ్లు తిరుగుట, అలాగే అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించి, ధూప దీపాలతో అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

News March 9, 2026

MDK: చట్టపరంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం: ఏఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఆయనకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న అదనపు ఎస్పీ, అందిన ఫిర్యాదులపై క్షుణ్నంగా పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News March 9, 2026

మెదక్: ఇంటర్‌ పరీక్షలు.. 96.80 శాతం హాజరు

image

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్-I, ఎకనామిక్స్-I పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6,401 మందికి గాను 6,198 మంది, ఒకేషనల్ విభాగంలో 621 మందికి గాను 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొమ్మిదో రోజు మొత్తం 96.80 శాతం హాజరు నమోదైంది. DIEO మాధవి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.