News January 26, 2025

మెదక్: జిల్లా వ్యాప్తంగా మొత్తం 544 సభలు: కలెక్టర్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 నుంచి 23 వరకు 469 గ్రామ సభలు నిర్వహించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యాప్తంగా 75 వార్డు సభలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు 40,092, ఇందిరమ్మ ఇళ్లకు 23,383, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,501, రైతు భరోసాకు 308 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

Similar News

News November 4, 2025

కౌడిపల్లి: ‘విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి’

image

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు స్పష్టం చేశారు. కౌడిపల్లి ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మాసహారం, చికెన్ పెట్టడం లేదని చెప్పారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన బోజనానికి కట్టుబడి ఉందన్నారు.

News November 4, 2025

మెదక్: స్పెషల్ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ

image

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

News November 4, 2025

మెదక్: రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు నిజాంపేట విద్యార్థి ఎంపిక

image

రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు నిజాంపేట మండలానికి చెందిన విద్యార్థి కార్తీక్ గౌడ్ ఎంపికయ్యాడు. తూప్రాన్‌లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్-17 ఉమ్మడి మెదక్ జిల్లా రగ్బీ సెలక్షన్‌లో కార్తీక్ గౌడ్ ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జ్ఞానమాల, పీడీ ప్రవీణ్ తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది.