News August 19, 2025
మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా కాగజ్ మద్దూర్ 62.8 మిమీలు, దామరంచ 59.3, మిన్పూర్, నర్సాపూర్ 53.3, మాసాయిపేట్ 50, వెల్దుర్తి 46, శివంపేట్ 43.5, నార్లాపూర్ 43.3, కొల్చారం 41, చిప్పలతుర్తి 40.8, రామాయంపేట 37.8, ఇస్లాంపూర్ 34.5, చేగుంట 31.3 మిమీల వర్షం కురిసింది.
Similar News
News October 26, 2025
‘TET నుంచి మినహాయింపు ఇవ్వాలి’

సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి 2023 జూలై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
News October 26, 2025
మెదక్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి..?

మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈనెల 27న మెదక్ పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో డ్రా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మద్యం పాలసీ 2025-27కు జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు రాగా రూ.42.60 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎవరికి దక్కుతుందో చూడాలి.
News October 26, 2025
31న మెదక్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్‌ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్‌ఎస్‌ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.


