News April 9, 2025

మెదక్: జీవో సవరణ కోసం వీఆర్వోల వినతి

image

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు పూర్వ వీఆర్వోలు వినతి పత్రం సమర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలను జిపిఓలుగా తీసుకోవడానికి జారీచేసిన జీవో 129ను సవరణ చేసి పాత వీఆర్వోలను యధావిధిగా కామన్ సర్వీస్ ఇస్తూ నియామకం చేయాలని కోరారు. మెదక్‌లో సమావేశం నిర్వహించి 16లోగా గూగుల్ ఫారం నింపాలని జారీ చేసిన ఆదేశాలపై చర్చించారు. జీవో లోపాలను సవరిస్తూ పాత సర్వీస్‌ కౌంట్ చేస్తూ, యధావిధిగా తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు

Similar News

News April 17, 2025

మెదక్: ఈ నెల 20 నుంచి ఓపెన్ పరీక్షలు: డీఈఓ

image

ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

News April 17, 2025

మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు

image

మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. గురువారం మనోహారాబాద్, తుప్రాన్, 18న అల్లాదుర్గ్,రామాయంపేట, 19న శివంపేట,నర్సాపూర్, 20న కూల్చారాం, కౌడిపల్లి, 21న చిలిపిచేడ్, పాపన్నపేట,టేక్మాల్, 22న పెద్దశంకరంపేట్, రేగోడ్, 23న మసాయిపేట్, చేగుంట, చిన్నశంకరంపేట్, 24న ఎల్డుర్తి, నిజాంపేట్, 25న నార్సింగి, మెదక్, హవేళి ఘనపూర్ మండలాలున్నాయి.

News April 17, 2025

టేక్మాల్: బైక్ యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.

error: Content is protected !!