News January 4, 2026
మెదక్: టెట్ పరీక్ష ప్రశాంతం: డీఈవో విజయ

మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయ తెలిపారు. ఆదివారం రెండో రోజులో భాగంగా మొదటి పేపర్‌కు 100, రెండో పేపర్‌కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్‌కు 48 మంది హాజరు కాగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. 81 మంది గైర్హాజరయ్యారన్నారు.
Similar News
News February 21, 2026
మెదక్‌లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

మెదక్‌లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News February 21, 2026
మెదక్: మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (DMAC)లో సభ్యత్వం పొందేందుకు జీఓ 252 ప్రకారం జిల్లాలోని మీడియా అసోసియేషన్లు, సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.
News February 20, 2026
ఇంటర్ పరీక్షలకు మెదక్ జిల్లా విద్యార్థులు సిద్ధం

* ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల
* పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య: 12,334
* ప్రథమ సంవత్సరం 6,309 (ఒకేషనల్ 599)
* ద్వితీయ సంవత్సరం 6,025 (ఒకేషనల్ 553)
* జిల్లాలో మొత్తం పరీక్ష కేంద్రాలు : 28
* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు నిఘా
* పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి
పరీక్షలంటే టెన్షన్ వద్దు.. ఒత్తిడిని జయిస్తే మీదే విజయం


