News January 12, 2025
మెదక్: తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి: సీపీ
సిద్దిపేట జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించవద్దని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. ఈ నెల 13 నుంచి 28 వరకు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 13, 2025
సంక్రాంతి రైతన్న జీవితాల్లో వెలుగులు నింపాలి: కేసీఆర్
రైతులకు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి అని మాజీ సీఎం KCR అన్నారు. ‘X’ వేదికగా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వల్లనే తెలంగాణలో వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాగుకు, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి రైతన్నల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
News January 13, 2025
మెదక్ జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో సోమవారం గం.8:30 AMవరకు నమోదైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అందోల్, కోహిర్ 13.6 డిగ్రీలు, చోటకుర్, పుల్కల్ 14.0, నాల్కల్ 14.4, మెదక్ జిల్లాలో వెల్దుర్తి 14.6, పెద్ద శంకరంపేట, అల్లాదుర్గ్ 15.2, టేక్మాల్ 15.4, రేగోడ్ 15.5, సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్ భూంపల్లి 15.2, దుబ్బాక 15.3, మిర్దొడ్డి 15.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 13, 2025
MDK: వీధుల్లో భోగి మంటలు, రంగవల్లులు
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొంది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్గులతో ఇంటి వాకిళ్లను అలంకరించారు. పోటీపడి మరీ రథం వల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. పిల్లలకు రేగిపండ్లతో స్నానాలు చేయిస్తున్నారు. హరిదాసులతోపాటు అలంకరించిన డూడూ బసవన్నలు ఇంటింటికీ వెళ్తున్నాయి.