News March 4, 2025
మెదక్: తమ్ముడి దాడిలో అన్న మృతి

తమ్ముడు దాడి చేయడంతో అన్న మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మాసాయిపేటకు చెందిన దుంపల రాజు, అతని తమ్ముడు చందు కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం రాత్రి గొడవపడ్డారు. ఈ గొడవలో తమ్ముడు అన్న రాజుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2025
హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.
News March 4, 2025
విజయవాడ: ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

విజయవాడలోని బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల, శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రాల‌్లో మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పలువురు అధికారులు ఉన్నారు.
News March 4, 2025
GWL: ‘లింగమ్మ బావి సుందరీకరణ చర్యలు చేపట్టాలి’

గద్వాల పట్టణంలోని లింగమ్మ బావి సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆర్కిటిక్ శ్రీలేఖతో కలిసి లింగమ్మ బావిని పరిశీలించారు. బావిలోకి దిగేందుకు ఉన్న స్టెప్ లెవెల్‌ను పునరుద్ధరించి, ఎప్పటికీ నీరు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బావి చుట్టూ రైలింగ్ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని సూచించారు.