News September 10, 2025
మెదక్: తొమ్మిది నెలల్లో 648 మంది సూసైడ్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వివిధ కారణాలతో 648 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 204, మెదక్‌లో 228, సిద్దిపేటలో 216 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
Similar News
News April 14, 2026
తిరుపతి: రేపటి నుంచి పుస్తకాల పంపిణీ: ఆర్ఐవో

తిరుపతి జిల్లాలో ఇంటర్ క్లాసులు ప్రారంభమై 15 రోజులు గడిచినా రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఖాళీ చేతులతో క్లాసులకు వెళ్లిన విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన అధికారులు నూతన సిలబస్ పుస్తకాలను ఆర్ఐఓ కార్యాలయానికి చేరవేశారు. పంపిణీ ప్రక్రియ ప్రారంభమై, బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాలు అందనున్నాయని ఆర్ఐఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News April 14, 2026
భయంకరమైన వ్యసనం.. సొంత రక్తాన్నే ఇంజెక్ట్ చేసుకుంటున్నారు

భోపాల్(MP)లో యువత భయంకర వ్యసనం బారిన పడుతున్నారు. మత్తు కోసం తమ రక్తాన్ని బయటకు తీసి మళ్లీ శరీరంలోకి ఎక్కించుకుంటున్నారు. JAN నుంచి ఇలాంటి 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘బ్లడ్ కిక్’ అంటున్నారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, హెపటైటిస్, నరాలు దెబ్బతినడం, రక్తం గడ్డకట్టడం తదితర సమస్యలొస్తాయి. డిప్రెషన్, తనకు తానే గాయపర్చుకునే లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
News April 14, 2026
దేవ్ జీ ఇక్కడ.. మరి గణపతి ఎక్కడ..?

మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీ స్వస్థలం కోరుట్లకు ఇటీవల వచ్చారు. దీంతో బీర్పూర్ వాసి గణపతి రాక గురించి జిల్లాలో చర్చ జరుగుతోంది. భారత సాయుధ విప్లవోద్యమానికి వెన్నెముకగా నిలిచిన గణపతి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నంబాల కేశవరావుకు మాత్రమే గణపతి ఆచూకీ తెలుసని, కానీ, ఆయన ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారని దేవ్‌జీ చెబుతున్నారు. అసమానతలపై ఆయుధమై గర్జించిన గణపతిని చూడాలని, ఆయన లొంగిపోతే బాగుంటుందని జిల్లా కోరుతున్నారు.


