News December 4, 2025

మెదక్: తొలి విడతలో 144 గ్రామాల్లో ఎన్నికలు

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న 160 గ్రామ పంచాయతీల్లో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 1402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 14 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అవడంతో ఈరోజు ఉపసర్పంచ్ ఎన్నిక సైతం నిర్వహించినట్లు వివరించారు. మిగిలిన 144 సర్పంచ్, 1072 వార్డులకు 11న ఎన్నికల నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Similar News

News February 14, 2026

నర్సాపూర్: నాడు 47తో ఓటమి.. నేడు 213తో గెలుపు

image

గత పురపాలక ఎన్నికల్లో నర్సాపూర్ 10వ వార్డు నుంచి పోటీ చేసి కేవలం 47 ఓట్లతో ఓటమి పాలైన అంతారం సుధీర్ గౌడ్.. ఈసారి పట్టుదలతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2వ వార్డు బరిలో నిలిచి, బీజేపీ ప్రత్యర్థిపై 213 ఓట్ల మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. ఓటమికి కుంగిపోకుండా ప్రజాసేవే లక్ష్యంగా పోరాడి గెలవవచ్చని ఆయన నిరూపించారు.

News February 14, 2026

మెదక్: వరుసగా 3వ సారి విజయం

image

మెదక్ పట్టణం 14వ వార్డులో కౌన్సిలర్‌గా దొంతి లక్ష్మి మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున, 2020లో స్వతంత్ర అభ్యర్థిగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత 15 సంవత్సరాలుగా తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తున్న 14వ వార్డు ప్రజలకు దొంతి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు.

News February 14, 2026

మెదక్: కౌన్సిలర్లుగా వదిన మరదలు

image

మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 3వ వార్డు నుంచి కొటాల లలిత విశ్వం, 4వ వార్డు నుంచి ధరిమిశెట్టి స్వరూప బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్లుగా గెలుపొందారు. స్వయానా వదిన, మరదలైన వీరిద్దరూ విజయం సాధించడంతో అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.