News December 16, 2025

మెదక్: దంపతులిద్దరూ వార్డు సభ్యులు.. భర్త ఉపసర్పంచ్

image

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ మేజర్ గ్రామపంచాయతీకి ఆదివారం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో కాళ్లకల్ గ్రామపంచాయతీ ఆరో వార్డు సభ్యులుగా వీరబోయిన ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ ఎన్నిక కాగా, భార్య వీరబోయిన మమత ముదిరాజ్ ఏడో వార్డు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఉపసర్పంచిగా సభ్యుల మద్దతుతో ఎన్నికయ్యారు.

Similar News

News December 18, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* టమాటాలు బాగా మగ్గినపుడు కాగితం సంచిలో ఉంచి యాపిల్‌ను పెడితే మరో 2రోజులు తాజాగా ఉంటాయి.
* మీల్ మేకర్ అల్యూమినియం పాత్రల్లో ఉడికిస్తే గిన్నె నల్లగా మారిపోతుంది.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలనుకొన్నప్పుడు శుభ్రం చేసి ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి.
* అరటికాయలు కోసిన తరువాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్ళలో 4చుక్కల వెనిగర్ కలపాలి.

News December 18, 2025

నిర్మల్: ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్

image

జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ తేదీల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, క్రిస్మస్ సెలవుల అనంతరం ఈనెల 29 30 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని అన్ని మండల విద్యాధికారులు, అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News December 18, 2025

క్లౌడ్, ఆన్‌లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: CBN

image

AP: భూ రికార్డుల ఆర్కైవ్స్‌నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని CM CBN అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్‌లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్‌కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.