News February 4, 2025

మెదక్: దంపతుల మృతితో పిల్లలు అనాథలు

image

మెదక్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో <<15350285>>దంపతుల మృతి<<>> ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గత నెల 11న నార్సింగి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అనారోగ్యంతో చనిపోగా ఆయన భార్య జ్యోతి నిన్న గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వీరి కొడుకు, కూతురు తల్లిదండ్రులు లేని అనాథలుగా మిగిలారు. కొడుకు మృతిని తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్ తల్లి 2రోజుల క్రితం పక్షవాతంతో ఆస్పత్రిలో చేర్చారు.

Similar News

News March 2, 2026

KMR: టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

image

కామర్ది జిల్లాలోని టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు జనవరి-2026 డ్రాయింగ్‌ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందన్నారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, హాల్ టికెట్ నంబర్ ద్వారా మార్కుల జాబితాను పొందవచ్చనన్నారు.

News March 2, 2026

NTPCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>NTPC<<>> 8 Sr. మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech(కెమికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్/స్క్రీనింగ్, రాత పరీక్ష/CBT, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Sr. మేనేజర్‌కు నెలకు రూ.90K-రూ.2.40L, ఇంజినీర్‌కు రూ.50K-రూ.1.60L చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

News March 2, 2026

ఖమ్మం ఇళ్ల కూల్చివేతలపై కేరళం సీఎం ధ్వజం

image

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతపై కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం “బుల్డోజర్ రాజ్యాన్ని” నడుపుతోందని ఆయన విమర్శించారు. ఫిబ్రవరి 24న తెల్లవారుజామున ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా వినోబా నగర్‌లోని సుమారు 700 ఇళ్లను కూల్చివేయడంతో 3,000 మంది నిరాశ్రయులయ్యారని మండిపడ్డారు.