News January 6, 2026

మెదక్: దారుణం.. తండ్రిని కొట్టి చంపిన కొడుకు

image

పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామంలో విషాదం అలుముకుంది. లంగిడి లక్ష్మయ్య (45) కరెంట్ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు శ్రీకాంత్ తాగిన మత్తులో డబ్బుల కోసం గొడవపడ్డాడు. తండ్రి లక్ష్మయ్యను కొడుకు కర్రతో తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావం జరిగింది. లక్ష్మయ్యను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.

Similar News

News January 9, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

image

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.

News January 9, 2026

నల్గొండ: ‘నో హెల్మెట్-నో పెట్రోల్’.. వ్యాపారులకు ఫుల్ డిమాండ్

image

జిల్లాలో ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ నిబంధనను పోలీసులు కఠినంగా అమలు చేస్తుండటంతో హెల్మెట్ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. హెల్మెట్ ఉంటేనే బంకుల్లో ఇంధనం పోయాలని ఎస్పీ కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News January 9, 2026

TGలో ‘రాజాసాబ్’ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈరోజు రాత్రి 11.30 గంటల ప్రీమియర్ షోకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అటు ఏపీలో 9pmకే ప్రీమియర్స్ ప్రారంభం కాగా, థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.