News April 9, 2025
మెదక్: ధరణి సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి సమస్యలను పక్కా ప్రణాళికతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ధరణి సమస్యలపై సంబంధిత అదనపు కలెక్టర్ నగేష్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగులో ఉన్న దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News April 18, 2025
మెదక్ సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ బదిలీ

మెదక్ సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ బదిలీ అయ్యారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జడ్జిల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జితేందర్ మెదక్ నుంచి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌కు 27వ అదనపు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. మెదక్ సీనియర్ సివిల్ జడ్జిగా అర్చన రెడ్డి బదిలీపై రానున్నారు. ఇప్పటికే జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయిన విషయం తెలిసిందే.
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.
News April 18, 2025
భూభారతి చట్టం రైతుల పాలిట వరం: రాహుల్ రాజ్

భూ భారతి చట్టం రైతుల పాలిట వరమని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తూప్రాన్‌లో నిర్వహించిన భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుభూభారతి నూతన చట్టంపై రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్డీవో జయ చంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.