News November 23, 2024

మెదక్: నర్సింగ్ కళాశాల మంజూరుకు ఉత్తర్వులు జారీ

image

మెదక్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల స్థాపనకు వైద్య శాఖ పరిపాలన మంజూరు చేసింది. సివిల్ వర్క్స్ నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణకు ఒక్కో కళాశాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తూ TOMSIDCకి అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 22, 2024

మెదక్: ‘డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 91.31% సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News November 22, 2024

ఓయూలో ఎంఈ, ఎంటెక్‌ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

image

HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 22, 2024

MDK: నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

image

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.