News February 27, 2026
మెదక్: నాడు అడిషనల్ కలెక్టర్.. నేడు కలెక్టర్!

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేశారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న ప్రతిమా సింగ్ తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా మెదక్ కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే ప్రతిమా సింగ్ కలెక్టర్‌గా ఎలాంటి మార్కు చూపిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 27, 2026
గ్రేటర్ వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు: కలెక్టర్

ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రభుత్వం 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బస్సుల నిర్వహణకు అవసరమైన డిపో స్థలాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
News February 27, 2026
ఉత్తరాంధ్రకు భారీ ఫార్మా సంస్థ: లోకేశ్

AP: కూటమి పాలనలో ఉత్తరాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రేపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ ‘బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్’కు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. 2028-29 FYకు సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుందని వివరించారు.
News February 27, 2026
త్వరలో విజయవాడకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి సవిత

త్వరలో విజయవాడకు 100 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నట్లు మంత్రి సవిత శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ బస్సులలో సైతం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తామని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా అత్యున్నత రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. పర్యావరణహితంగా, సరికొత్త హంగులతో సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్ బస్సులు విజయవాడ వాసులకు అందుబాటులోకి రానున్నట్లు సవిత స్పష్టం చేశారు.


