News August 30, 2025
మెదక్: నితన్య సిరి అభినందించిన ఎస్పీ

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబర్‌లో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.
Similar News
News August 31, 2025
MDK: ‘అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు’

రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.
News August 30, 2025
మెదక్: రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ మీటింగ్

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
News August 30, 2025
MDK: సింగూరుకు లక్ష క్యూసెక్కులు.. జాగ్రత్త: కలెక్టర్

మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని సాయిగాంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు
సుమారు లక్ష క్యూసెక్కులు వస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సింగూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు మంజీరాకు విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీరా నది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపారు.