News September 5, 2025

మెదక్: నిమజ్జనంలో విషాదం.. యువకుడు మృతి

image

హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ కుమారుడు సుధాకర్(17) శుక్రవారం సాయంత్రం రామస్వామి కుంట వద్ద నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు. నిర్వాహకులు, గ్రామస్థులు వెతకగా, అతని మృతదేహం బయటపడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News September 6, 2025

వేములవాడ: మహిళ సాధికారతపై విద్యార్థులకు అవగాహన

image

వేములవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో 10 రోజుల మహిళా సాధికారికత అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజు మహిళా శిశు సంక్షేమ పథకాలు, టోల్ ఫ్రీ నంబర్లు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ విషయాలు వివరించారు. డిజిటల్ టెక్నాలజీ దుర్వినియోగం ప్రభావాలు, వాటి నుంచి రక్షణ మార్గాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పాల్గొన్నారు.

News September 6, 2025

నిమజ్జనాన్ని పరిశీలించిన వరంగల్ కలెక్టర్

image

నర్సంపేటలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారద శుక్రవారం రాత్రి పరిశీలించారు. పట్టణ శివారు దామర చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనాన్ని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. ఎన్ని విగ్రహాలు, ఏర్పాట్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏసీపీ, ఆర్డీవో ఉమరాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తదితరులున్నారు.

News September 6, 2025

అమెరికాకు భారత్ తలవంచుతుంది: ట్రంప్ సలహాదారు

image

ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్‌ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.