News March 7, 2025

మెదక్: నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ సమావేశ హాలులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సమీక్షించారు. తాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.

Similar News

News April 21, 2025

BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

image

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్‌పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

మెదక్: BRS నేతలపై కేసు నమోదు

image

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ చిత్రలేఖనం గీసిన బీఆర్ఎస్ నాయకులపై హావేళి ఘణపురం మండల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నేతలు ఆర్.కె.శ్రీను, జుబేర్, ఫాజిల్‌లపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!