News April 8, 2025
మెదక్: నేటి నుంచి పదోతరగతి మూల్యాంకనం

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో నేటి నుంచి నిర్వహించే టెన్త్ క్లాస్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 1,222 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటారన్నారు. టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
జహీరాబాద్: యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.
News April 8, 2025
వర్గల్: ముగ్గురు అనుమానాస్పద వ్యక్తుల అరెస్ట్

ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారిని విచారణ చేయగా రామాయంపేట నస్కల్‌కు చెందిన ఎధీజాజ్, సికింద్రాబాద్‌కు చెందిన హిదాయత్ అలీ, బాలాజీ నగర్‌కు చెందిన మద్దూరు లాలును అరెస్ట్ చేసి వారి నుంచి 30 బుల్లెట్లు, రివాల్వర్, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News April 8, 2025
నార్సింగి : భర్తతో గొడవ ఆత్మహత్య

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.