News January 25, 2026
మెదక్ : పరేడ్ రిహార్సల్స్ పరిశీలన

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం రిహార్సల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ మహేందర్ పర్యవేక్షించి, పోలీస్ దళాల విన్యాసాలను పరిశీలించారు. వేడుకల రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 1, 2026
మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.
News February 1, 2026
మెదక్: ఆపరేషన్ స్మైల్.. 81 మంది SAFE

జిల్లాలో జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 81 మంది బాలలను రక్షించి, 69 మందిని తల్లిదండ్రులకు అప్పగించి, 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 6 పాఠశాలలో ప్రవేశం కల్పించడం అభినందనీయమన్నారు.
News February 1, 2026
మెదక్: NATIONALలో సిల్వర్ మెడల్

మాస్టర్స్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2026 లాంగ్ జంప్‌లో రిటైర్డ్ పీడీ డా.కే.ప్రభు సిల్వర్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి పోటీలు రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లో జరిగాయి. గత నెలలో రాష్ట్ర స్థాయి మాస్టర్ పోటీలు కరీంనగర్‌లో జరగ్గా గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించారు. ప్రభు మెడల్ సాధించడం పట్ల వ్యాయామం ఉపాధ్యాయులు, గుల్షన్ క్లబ్ సభ్యులు అభినందించారు.


