News March 29, 2024

మెదక్ పార్లమెంట్‌లో యువతే కీలకం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే ఆయా పార్టీలకు కీలకంగా మారనున్నాయి. మెదక్ లోకసభ స్థానంలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, అందులో 39 ఏళ్ల లోపు వారే 9, 52,583 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 53,458 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఏప్రిల్ 15 వరకు నూతన ఓటర్లు నమోదు చేసుకునే వెసులుబాటును ఎలక్షన్ కమీషన్ ఇవ్వడంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Similar News

News December 11, 2025

మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

image

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ‌భారతి లక్పతి నాయక్ ‌ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.

News December 11, 2025

మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

image

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.

News December 11, 2025

మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

image

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.