News February 1, 2025

మెదక్: పోలీసుల కౌన్సెలింగ్‌.. ప్రేమ పెళ్లి చేసిన పెద్దలు

image

రామాయంపేటలోని పెద్దమ్మ గుడి వద్ద ప్రేమ వివాహం జరిగింది. ఇరు కుటుంబాల కథనం ప్రకారం.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మామిడాల వినయ్, రామాయంపేటకు చెందిన రేవతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్య వినయ్ పెట్టడంతో శనివారం రేవతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబీకులు ముందుకొచ్చి రేవతి, వినయ్ పెళ్లి చేశారు.

Similar News

News February 20, 2026

సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మెదక్ కలెక్టర్

image

10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి జడ్పీ హైస్కూల్లో ప్రత్యేక తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. బట్టి పద్ధతికి దూరంగా ఉండి అంశాలపై పట్టు సాధించాలని, ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాలని సూచించారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు.

News February 20, 2026

ఎడ్యుకేషనల్ హబ్‌గా సిద్దిపేట అభివృద్ధి: హరీశ్ రావు

image

సిద్దిపేటను మెడికల్, పారామెడికల్ కాలేజీలు, ఐటీ టవర్‌తో అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని MLA హరీశ్ రావు తెలిపారు. ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. యువత ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, మొబైల్ వ్యసనాలకు దూరంగా కష్టపడి చదివితే పేదరికం అడ్డుకాదని సూచించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

News February 20, 2026

మెదక్: 22న బేస్ లైన్ పరీక్షలు

image

ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలకు ఎస్.వెంకటస్వామి కో ఆర్డినేటర్ 8008403635 ఫోన్ చేయాలని సూచించారు.