News November 17, 2024
మెదక్: ప్రజాపాలన విజయోత్సవాలు వాయిదా: కలెక్టర్
మెదక్ పట్టణంలో సోమవారం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలు-2024 అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రాత్రి 10 గంటలకు తెలిపారు. తదుపరి కార్యక్రమాల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముందుగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2024
మాయగాళ్లను నమ్మి మోసపోకండి.. నిరుద్యోగులకు మంత్రి సూచన
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 17, 2024
దశాబ్దం తరువాత రాష్ట్రంలో ప్రజాపాలన: మంత్రి పొన్నం
దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులు 4696 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇందిరమ్మ పాలనకు నిదర్శనం అన్నారు. దశాబ్ద కాలంగా మిడ్ మానేరు పునరవాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని ఎన్నో పోరాటలు, నిరసనలు గతంలో చేశామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో న్యాయం జరుగుతుందన్నారు.
News November 17, 2024
గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది..?: రఘునందన్ రావు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఐపీ, ఓపి విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా..? అని X వేదికగా ఎంపీ నిలదీశారు.