News January 21, 2026

మెదక్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడమే ప్రజాపాలనా? హరీష్ రావు

image

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణమన్నారు. అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

Similar News

News February 4, 2026

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం: డీఈవో

image

విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని DEO విజయలక్ష్మి పిలుపునిచ్చారు. పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన డీఈవో, చదువుపై పూర్తి దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గనిర్దేశాన్ని పాటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.

News February 3, 2026

మెదక్: ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

image

మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావుతో కలిసి పలు సూచనలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని డీజీపీ ఆదేశించారు. పోలీసులకు ఎన్నికల చట్టాలపై లీగల్ అవగాహన కల్పించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 3, 2026

మెదక్ మున్సిపల్ బరిలో 113 మంది.. ఒక వార్డు ఏకగ్రీవం

image

మున్సిపల్ ఎన్నికల పోరులో మెదక్ మున్సిపాలిటీలో అభ్యర్థుల ఖరారు పూర్తయింది. మొత్తం 32 వార్డులకు గాను, 32వ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 31 వార్డుల్లో 112 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీల వారీగా.. కాంగ్రెస్ 32, బీఆర్‌ఎస్ 31, బీజేపీ 27 వార్డుల్లో అభ్యర్థులను నిలపగా, బీఎస్పీ 6 చోట్ల పోటీ చేస్తోంది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఉండటం ఆసక్తికరంగా మారింది.