News August 24, 2025
మెదక్: ‘ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి’

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ ఫోన్ ద్వారా ప్రయాణికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసిన ఫిర్యాదులు, సూచనల మేరకు పని చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాని, ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News August 24, 2025
మెదక్: ‘వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మెదక్ వైద్యాధికారి డా. శ్రీరామ్ అన్నారు. పాపన్నపేట PHCని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు, రోగులకు మందుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో చందర్, క్రాంతి, శారద తదితరులు పాల్గొన్నారు.
News August 24, 2025
మెదక్: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

మెదక్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. ప్రభుత్వ, ZP, మండల పరిషత్, మోడల్ స్కూల్, KGBV పాఠశాలల ప్రిన్సిపల్స్, HMలు, టీచర్లు అర్హులని చెప్పారు. HM/ప్రిన్సిపాల్ 15, ఇతర టీచర్లకు10 ఏళ్ల సర్వీస్ ఉండాలన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 30 లోపు DEO ఆఫీస్‌లో అందజేయాలన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబర్ 5న సత్కరించనున్నట్లు తెలిపారు.
News August 24, 2025
మట్టి గణపతిని పూజిద్దాం: కలెక్టర్ రాహుల్ రాజ్

‘మట్టి గణపతిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడదాం’ అని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కార్యాలయం రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు సూచించారు.