News January 17, 2026

మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.

Similar News

News January 28, 2026

మెదక్: ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి

image

ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జాతర పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 28, 2026

నర్సాపూర్: బాడీ బిల్డింగ్‌లో అదరగొట్టిన GOVT టీచర్

image

నర్సాపూర్‌కు చెందిన GOVT టీచర్ఎ ల్. శ్రీనివాస్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయన తెలంగాణ ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఢిల్లీలో జరగనున్న నేషనల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం చిలప్‌చెడ్ మండలం గౌతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.

News January 28, 2026

రామాయంపేట: ఎన్నికల ముందే హామీల అమలు!

image

రామాయంపేట మున్సిపాలిటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ముందే అమలు చేస్తూ పలు వార్డుల్లో మినీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాలను వివరిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.