News September 5, 2025

మెదక్: ప్రేమ పెళ్లి వద్దన్నందుకు యువతి సూసైడ్ (UPDATE)

image

ప్రేమ విఫలం కావడంతో <<17611907>>యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. శివ్వంపేట మం. తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయి(21) గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. నారాయణఖేడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. వరసకు అన్న అవుతాడని పెళ్లి వద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఈనెల 1న పురుగు మందు తాగింది. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News September 7, 2025

ఖమ్మం: రేపు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

స్థానిక సంస్థల ఓటర్ల జాబితాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రేపు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ స్టేషన్ల జాబితాపై సమీక్షించనున్నారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు రేపు సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్ కోరారు.

News September 7, 2025

జూ పార్కులో వివిధ రకాల జంతు, పక్షి పిల్లల జననం

image

విశాఖ జూ పార్కులో ఏడు జంతు, పక్షి పిల్లలు జన్మించాయి. చౌసింఘా, బ్లూ గోల్డ్ మకావ్, బ్లాక్ బక్ వంటి జాతులకు సంబందించిన పిల్లలు జన్మించినట్లు క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. బ్లూ గోల్డ్ మకావ్‌ను కొన్ని వారాలుగా నియంత్రిత ఇంక్యుబేషన్ సెంటర్లో ఉంచామన్నారు. వీటిని జూ వైద్య బృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని, నూతన జంతు, పక్షి జాతులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

News September 7, 2025

జపాన్ ప్రధాని రాజీనామా

image

జపాన్ PM షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ఎగువ సభలో పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ ఆయనపై సొంత పార్టీ(లిబరల్ డెమోక్రటిక్) నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు షిగెరు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వం త్వరలోనే ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోనుంది.