News August 12, 2025
మెదక్: ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరంగకుండా తనిఖీలు చేయాలి: కలెక్టర్

రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News August 13, 2025
మెదక్: నషా ముక్త భారత్ అభియాన్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.
News August 13, 2025
మెదక్: 3 రోజులలో నివేదికలు సమర్పించాలి: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 3 రోజులలో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, డీఎం రెడ్ కో రవీందర్ చౌహన్, జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఉండాలన్నారు.
News August 13, 2025
మెదక్: బాధితులకు అండగా భరోసా సెంటర్: ఎస్పీ

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో గల భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్తో కలిసి సందర్శించారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై అరా తీశారు.